ఎందుకో ఈ రోజు అమ్మ గురించి రాయాలనపడింధి. అందుకే అది కూడా తెలుగులో మొదలు పెట్టాను. నేను వై యస్ జయమ్మ గారి కుమార్తె రాసిన పుస్తకం ఆడియో వింటున్నాను. దాని ప్రారంభంలో అమ్మ గురించి చెప్పారు.
ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవుడు మనలను ఆయన స్వరూపంలో ఆయనలా సృష్టించాడు. తాను సృష్టించిన మానవాళిని పాపం నుండి రక్షించడానికి తన ఏకైక కుమారుడిని ఈ భూమిపైకి మానవరూపంలో పంపాడు. ఆ దేవాది దేవుడు కూడా తన కుమారుడి జన్మకు ఓ అమ్మను ఎన్నుకున్నాడు. దేవుని ఈ సృష్టి కార్యంలో నిరంతర భాగస్వామి అమ్మ. కనిపించని దేవునికి కనిపించే ప్రతిరూపమే అమ్మ. దేవునికి తన బిడ్డలపై ఉండే ప్రేమకు శ్రేష్టమైన ఉదాహరణ తల్లి ప్రేమ. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తల్లి తన బిడ్డలను ఏ షరతులు లేకుండా నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. దేవునివలే ఎలాంటి స్వార్దమూ లేకుండా ఇస్తూ ఉండేదే కన్నప్రేమ. అమ్మ అన్నది ఒక కమ్మని మాట. మధురానురాగాల తరగని ఊట.